
అనకాపల్లి,, 27 మే (హి.స.)అనకాపల్లి, పెదబొడ్డేపల్లి (నర్సీపట్నం), న జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో మహానాడు వేడుకలు భారీ ఎత్తున నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన మంత్రి మోదీ పిలుపునందుకుని ఈ ఏడాది మహానాడు వర్చువల్గా నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్లస్టర్ పరిధిలో హైబ్రిడ్ విధానంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మరింత మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం కలుగుతుందని నాయకులు భావిస్తున్నారు. జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో 73 క్లస్టర్లున్నాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఒక వేదిక ఏర్పాటు చేసి ఈ వేడుకలు నిర్వహిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ