
విజయవాడ:, 27 మే (హి.స.)
ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలపడిందని, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, భీమా పథకాలు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందన్నారు.
జూన్ 5 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా మోదీ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ