
అనకాపల్లి, 27 మే (హి.స.)
అనకాపల్లిలో ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని నర్సింగరావుపేట, తుమ్మపాల, మార్టూరు, బవులవాడ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పట్టణ, గ్రామీణ ఎస్సైలు డి.శ్రీనివాసరావు, రవికుమార్ సిబ్బంది సాయంతో వీటిని తొలగించారు. కొప్పాక జాతీయరహదారి వద్ద పడిన చెట్లను ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ సిబ్బంది సాయంతో తీయించి వాహనరాకపోకలు సజావుగా సాగేలా చూశారు. భీమునిగుమ్మం పాఠశాల సమీపంలో పార్కింగ్ చేసిన వాహనాలపై చెట్టు కూలిపోవడంతో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. బంగారుమెట్ట, వడ్డాది గ్రామాల్లో ఎండబెట్టిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు లబోదిబోమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ