తెలంగాణలోని.పలు.ప్రాంతాల్లో చిరు.జల్లులు
తెలంగాణలోని.పలు.ప్రాంతాల్లో చిరు.జల్లులు
తెలంగాణలోని.పలు.ప్రాంతాల్లో చిరు.జల్లులు


హైదరాబాద్ 27 మే (హి.స.)

: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. మండే ఎండలు.. ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు.. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్, బాలానగర్, బోయిన్పల్లి, అమీర్పేట్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, లక్డీకాపూల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande