విద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యత.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
విద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యత.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
భట్టి


ఖమ్మం, 27 మే (హి.స.)

రాబోయే విద్యా సంవత్సరానికి

గురుకులాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ లో బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సంబంధిత అధికారులతో కలిసి గురుకుల, సంక్షేమ వసతి విద్యాసంస్థలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీట్లు పూర్తిగా భర్తీ కాని రెసిడెన్షియల్ పాఠశాలలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి కారణాలు గుర్తించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని వసతి విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వేసవి కాలంలోనే అవసరమైన మరమ్మతులు, మౌళిక వసతుల పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో డైట్ ఛార్జీలు, మెనూ వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి గురుకుల విద్యాసంస్థకు ఒక జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించి, వారు ప్రతి నెల పాఠశాలలను సందర్శించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

. విద్యపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భారీగా నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. సిబ్బంది జీతాలు, డైట్ ఛార్జీలు, అద్దెల చెల్లింపులు ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నదని తెలిపారు. మరమ్మతుల నిధులు కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో పనులు క్షేత్రస్థాయిలో వేగంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande