
రాజన్న సిరిసిల్ల, 27 మే (హి.స.)
తుది దశకు చేరుకున్న ధాన్యం
కొనుగోళ్ళ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇప్పటివరకుయ ఈ కేంద్రంలో ఎంత ధాన్యం సేకరించారు? ఎంత వరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశారు అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ ఆరా తీయగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, తూకం వేసిన బస్తాలను మిల్లుకు వాహనాల ద్వారా తరలిస్తున్నామని కలెక్టర్ కు వివరించారు. తూకం వేసిన బస్తాలను జాప్యం చేయకుండా కొనుగోలు కేంద్రాల నుండి తరలించాలని కలెక్టర్ సూచించారు.
ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే టార్పాలిన్లు సరిపడా అందుబాటులో పెట్టుకోవడం ద్వారా వర్షాలకు ధాన్యం తడవకుండా ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లుకు తరలించిన అనంతరం మిల్లులో అన్ లోడింగ్ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న రకాల సాగుపై దృష్టి సారించాలని రైతులను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..