
నర్సంపేట, 27 మే (హి.స.)
, ఇటీవల దుగ్గొండి మండల పరిధిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని దుగ్గొండి పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకొని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ రవీందర్రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన తాళ్లపెళ్లి సుమలత భర్త మహేందర్ మృతిచెందగా.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటుంది. వివాహితుడైన అదే గ్రామానికి చెందిన పాండవుల సురేశ్ ఆమెతో అయిదేళ్ల్లుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ