ఆడబిడ్డల వల్లే విజయం.. ఇది మహిళా మహానాడు: చంద్రబాబు(update)
ఆడబిడ్డల వల్లే విజయం.. ఇది మహిళా మహానాడు: చంద్రబాబు
చంద్రబాబు


అమరావతి, 27 మే (హి.స.)

ఇటీవలి ఎన్నికల విజయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, అందుకే ఈ మహానాడును వారికి అంకితం చేస్తూ 'మహిళా మహానాడు'గా ప్రకటిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వర్చువల్ విధానంలో జరిగిన మహానాడు సభలో ఆయన మాట్లాడుతూ, మహిళలు, యువత భవిష్యత్తే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 'స్త్రీ శక్తి' ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 'దీపం 2.0' కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చంద్రబాబు వివరించారు. రానున్న రోజుల్లో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.

యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జెన్ జీ, జెన్ ఆల్ఫా తరం ఆలోచనలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఏఐ, ఏరోస్పేస్, సెమీ కండక్టర్స్ వంటి ఆధునిక రంగాలకు ఆంధ్రప్రదేశ్ను చిరునామాగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' స్థానంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారానే 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని అన్నారు. ఫైటర్ జెట్, బుల్లెట్ మోటార్సైకిల్ వంటి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande