చంద్రబాబును ఎదుర్కోవాలి.. ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరాలి: స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్
చంద్రబాబును ఎదుర్కోవాలి.. ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరాలి: స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్
jagan


అమరావతి 27 మే (హి.స.)

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే క్రమంలో నియోజకవర్గ ఇంఛార్జిలకు ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఏ నియోజకవర్గంలోనైనా, ఏ ఒక్క స్థానంలోనైనా ఎన్నిక ఏకగ్రీవమైతే, దానిని పూర్తిగా ఆ ఇంఛార్జి వైఫల్యంగానే పరిగణిస్తానని తేల్చిచెప్పారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తలు, ఇంఛార్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ కుట్రలను ఎదుర్కొని ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం నేను చాలా సీరియస్గా తీసుకుంటా. ఇది మళ్లీ మళ్లీ చెబుతున్నా. అలా జరిగితే అది నియోజకవర్గ ఇంఛార్జి ఫెయిల్యూర్గానే భావిస్తా అని జగన్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande