అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు మహానాడు
అమరావతి, 28 మే (హి.స.) పాడేరు, చింతపల్లి, డుంబ్రగూడ: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా తెదేపా ‘మహానాడు’ రెండో రోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా పాడేరు, చింతపల్లి, డుంబ్రిగూడ, అరకులోయలో తెదేపా నాయకులు, నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్కు ఘనంగా నివాళుల
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా రెండో రోజు మహానాడు


అమరావతి, 28 మే (హి.స.)

పాడేరు, చింతపల్లి, డుంబ్రగూడ: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా తెదేపా ‘మహానాడు’ రెండో రోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా పాడేరు, చింతపల్లి, డుంబ్రిగూడ, అరకులోయలో తెదేపా నాయకులు, నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర పరిశీలకులు రత్నకుమారి, టూరిజం డైరెక్టర్ వెంకట రమేష్ నాయుడు, తెదేపా నేతలు పాల్గొన్నారు. పలువురు నేతలు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పాలనను స్ఫూర్తిగా తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande