కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 29 సూత్రాల.పథకాలు ప్రజలందరికీ.చేరేలా.చర్యలు.తీసుకోవాలి / మంత్రి దినకర్
అమరావతి, 28 మే (హి.స.) అరకులోయ, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. అనంతగిరి మండలంలోని కాకరపాడు, అరకులోయ మండలంలోని సిమిలిగుడ గ్రామాలను బుధవారం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 29 సూత్రాల.పథకాలు ప్రజలందరికీ.చేరేలా.చర్యలు.తీసుకోవాలి / మంత్రి దినకర్


అమరావతి, 28 మే (హి.స.)

అరకులోయ, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. అనంతగిరి మండలంలోని కాకరపాడు, అరకులోయ మండలంలోని సిమిలిగుడ గ్రామాలను బుధవారం ఆయన సందర్శించారు. పీఎం జన్మన్లో భాగంగా మంజూరైన గృహాలను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గతేడాది సందర్శించిన గ్రామాల్లోని పరిస్థితులను పరిశీలించేందుకు మళ్లీ వచ్చానని పేర్కొన్నారు. గతంలో పునాదుల దశలోని జన్మన్ గృహాలు ప్రస్తుతం పూర్తయ్యే స్థితిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రకటించిన రూ. లక్ష సాయం వెంటనే లబ్ధిదారులకు విడుదల చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కాకరపాడుకు రహదారి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రహదారి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారన్నారు. అరకులోయ డివిజన్లో పీఎం జన్మన్లో భాగంగా రూ. 393 కోట్లతో 424 కిలోమీటర్ల మేర 146 రహదారులను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. గిరిజన ప్రాంతంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొన్నారు. హౌసింగ్ డీఈఈ రాజబాబు, పంచాయతీరాజ్ డీఈఈ రవికుమార్, ఏఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande