నేడు ఏపీలోని.పలు.ప్రాంతాల్లో తేలిక పాటి.వర్షాలు
నేడు ఏపీలోని.పలు.ప్రాంతాల్లో తేలిక పాటి.వర్షాలు
నేడు ఏపీలోని.పలు.ప్రాంతాల్లో తేలిక పాటి.వర్షాలు


అమరావతి, 28 మే (హి.స.)

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), : ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అలాగే దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో గురువారం బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

రాష్ట్రంలో బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 41.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 41.6, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గురువారం కొన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande