'రైతులపై కక్ష సాధింపు చేసిన ఏ ప్రభుత్వం నిలవలేదు'.. ఈటల రాజేందర్
'రైతులపై కక్ష సాధింపు చేసిన ఏ ప్రభుత్వం నిలవలేదు'.. ఈటల రాజేందర్
Etela


నిర్మల్, 28 మే (హి.స.)

తెలంగాణ రాష్ట్ర రైతన్నలు ఎండనక

వాననక ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నెలలు గడుస్తున్న కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు పడుతున్న కష్టాలు అంత ఇంత కాదని, రైతులు గోసను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉందని బీజేపీ కేంద్ర నాయకులు మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు చేపడుతున్న 'రైతు గోస బీజేపీ భరోసా' అనే సిద్ధాంతంతో చేపట్టిన యాత్ర భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వరకు చేరుకొని, మార్కెట్ యార్డ్ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కుప్పలు పరిశీలిస్తూ పలు రైతులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతులపై కక్ష సాధింపు చేసిన ఏ ప్రభుత్వం నిలువ లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఉండడంతో తొమ్మిది ఏళ్లకే రాష్ట్ర రైతన్నలు ఆ ప్రభుత్వాన్ని తొక్కిస్తే పాతాళగంగానికి చేరిందని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపడితే బీఅర్ఎస్ పార్టీకి పట్టిన గతి మూడు ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి ఇత్తును కొంటామని హామీలు ఇచ్చి ఇప్పుడు రైతులు పండించిన పంటలపై ఆంక్షలు విధిస్తుంది అని, రైతులు ఎకరానికి 35 నుండి 40 క్వింటల్ వరకు మొక్క జొన్న పండిస్తే కాంగ్రెస్ ప్రతి ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటల్ 50 కిలోల కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులపై కక్ష సాధింపు చర్యలు కాదా అని ఆయన విమర్శించారు.

కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని తీసుకువచ్చి నెలరోజులైనా కొనుగోలు చేయకపోవడం విడ్డూరపుగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఖానాపూర్ మార్కెట్ యార్డ్ కేంద్రానికి వచ్చి రైతుల గోసను చూడు అని సవాల్ విసిరారు. రైతాంగం పండించిన పంటలను మార్కెట్ కేంద్రాలకు తీసుకువస్తే వారం రోజుల లోపు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande