
అనకాపల్లి, 28 మే (హి.స.)
భరోసా పార్టీ అధినేత, క్రైస్తవమత ప్రచారకుడు అభినయ్ దర్శన్ ఈరోజు(గురువారం) నర్సీపట్నం సబ్జైల్ నుంచి విడుదలయ్యారు. గత 8 రోజులుగా నర్సీపట్నం సబ్జైల్లో రిమాండ్లో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియా ముందుకు వచ్చిన అభినయ్.. ‘నన్ను అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు, ఎస్పీకి కృతజ్ఞతలు’ అని అన్నారు. పోలీసులు, జైలు సిబ్బంది తనను చాలా గౌరవంగా చూసుకున్నారన్నారు. తనపై ఎవరూ చెయ్యి చేసుకోలేదరి, ఇన్వెస్టిగేషన్లో కూడా మర్యాదగా వ్యవహరించారని తెలిపారు. ఖైదీలు, పోలీసులు, జైలు సిబ్బంది ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని వెల్లడించారు.
పాదయాత్ర ఆగిపోతుందంటూ వస్తున్న రూమర్స్పై అభినయ్ దర్శన్ స్పష్టతనిచ్చారు. గాయపడిన సింహం లాంటివాడిని, మరింత కసితో వేటాడతానని స్పష్టం చేశారు. పాదయాత్రకు ఎలాంటి విరామం లేదని, పాడేరు నియోజకవర్గం నుంచే యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రజల కోసం, ప్రజా వ్యక్తిగా పోరాడటానికి తాను ఎప్పుడూ సిద్ధమే అని అభినయ్
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ