శివనామస్మరణతో మార్మోగుతున్న త్రివేణి సంగమం..
శివనామస్మరణతో మార్మోగుతున్న త్రివేణి సంగమం..
Kaleshwaram


భూపాలపల్లి, 28 మే (హి.స.)

హర హర శివ శివ, ఓం శివోహం, జై కాళేశ్వర ముక్తేశ్వర అంటూ కాళేశ్వరం త్రివేణి సంగమం శివనామస్మరణతో మారుమోగుతుంది. భూపాల్ పల్లి జిల్లా కాలేశ్వరంలో గత ఎనిమిది రోజులుగా సరస్వతి అంత్య పుష్కరాలు జోరుగా జరుగుతున్నాయి. రోజు, రోజుకు వేలాది మంది భక్తులు వచ్చి గోదావరి నదిలో సరస్వతీ పుష్కర స్నానాలు ఆచరించి కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులు అవుతున్నారు. కాళేశ్వరం క్షేత్రం శివనామ స్మృతంతో మారుమోగుతుంది. శివశక్తుల పూనకాలు, గోదావరి నదిలో ముత్తయిదుల హారతులు, చాటలలో గోదావరి మాతకు వస్త్రాల సమర్పణ గోదావరి మాతకు దీపాల సమర్పణతో, గోదావరి నది ఒడ్డున ఇసుక తో శివ లింగాలతో చేసి మొక్కలు సమర్పించుకుంటూ తన్మయత్వం పొందుతున్నారు.

గురువారం 8వ రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్ర మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మందిగా భక్తులు తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటూ శివనామ స్మరణ జపించుకుంటూ దేవుని సన్నిధిలో మొక్కులు తీర్చుకుంటున్నారు. కాళేశ్వరం అంతా శివమయం అయింది. గోదావరి నది ఒడ్డున ఏర్పాటుచేసిన బాహుబలి సెట్టింగ్ భక్తులందరినీ ఆకర్షిస్తుంది. సరస్వతీ మాత విగ్రహంతో పాటు జ్ఞాన దీపికలను ఏర్పాటు చేయడంతో భక్తులు కల్లారా వీక్షిస్తూ ఆనంద పరవశం అయిపోతున్నారు. కాశీలో శివుని దర్శించుకున్నామనే ఆనందంతో భక్తులు ఆనందం తబ్బిబ్బై పోతున్నారు. రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఏర్పాటులు చాలా గొప్పగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవ నామస్మరణ చేసుకుంటూ దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. భక్తులంతా సురక్షితంగా స్నానాలు ఆచరించి దైవదర్శనం చేసుకుని ఇప్పటివరకు సురక్షితంగా భక్తులంద సమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రతి ఉదయం నాలుగు గంటల నుంచి హర హర మహాదేవ నామస్మరణ కాలేశ్వరం అంత మారుమోగడంతో కాలేశ్వరం దైవ నామస్మరణతో నిండిపోతుంది. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి చరిత్రలో ఇంత గొప్పగా కార్యక్రమాలు చేయడం ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు. దేవాదాయ శాఖ ఏర్పాట్లు ప్రభుత్వ ఏర్పాట్లు ఇంత ఘనంగా ఎన్నడూ చేయలేదని భక్తులు స్థానిక నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సరస్వతి అంత్యపుష్కాల్లో ప్రతిరోజు ఒక పీఠాధిపతి పుష్కరస్నానమాచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించడంతో కాలేశ్వరంలో ఒక సందడి నెలకొని ఉంది. ప్రతి రోజు సాయంత్రం పీఠాధిపతి కాళేశ్వరం చేరుకొని ఉదయం ఐదు గంటల లోపే సరస్వతి అంత్య పుష్కరాలలో స్నానం చేసి పూజలు నిర్వహించి అనంతరం దైవదర్శనంతో పాటు హోమాల్లో పాల్గొనడంతో భక్తులంతా వారితో పాటు ఉండి పూజల్లో పాల్గొంటూ వారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande