బక్రీద్ పండుగ బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి
బక్రీద్ పండుగ బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి
SP Janaki


మహబూబ్నగర్, 28 మే (హి.స.)

బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి ఆదేశించారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బీ అలెర్ట్ గా పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, బీట్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించాలని ఆమె పేర్కొన్నారు. ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సోదరభావంతో ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తూ వారికి ఎస్పీ జానకి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ లు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, వన్ టౌన్ సీఐ అప్పయ్య, ఎస్బీ సీఐ మోతిరాం, సీసీఎస్ సీఐ కృష్ణ, ట్రాఫిక్ సీఐ రాజేందర్ రెడ్డి, తదితర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande