ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతాం : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, 28 మే (హి.స.) రైతులను పక్కదారి పట్టిస్తూ పబ్బం చేయాలని గడుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారం లేక మతిస్థిమితం కోల్పోయి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం యువతను రెచ్చగొడుతున్న బాల్క సుమన్కు తగిన బుద్ధి చెబుతామని కార్మిక, భూగర్భగనుల శాఖ మంత
Minister


మంచిర్యాల, 28 మే (హి.స.) రైతులను పక్కదారి పట్టిస్తూ పబ్బం

చేయాలని గడుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారం లేక మతిస్థిమితం కోల్పోయి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం యువతను రెచ్చగొడుతున్న బాల్క సుమన్కు తగిన బుద్ధి చెబుతామని కార్మిక, భూగర్భగనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుండగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను పక్కదారి పట్టిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు. స్వయంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాలకు రైతులు రావడం లేదని ఒప్పుకున్నారని, రైతులకు సరైన న్యాయం జరుగుతున్నప్పుడు ధర్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వ అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చిందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తామని, రైల్వే ట్రాక్లు పేల్చేస్తామని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరిస్తూ, బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు దోచుకుని రైతులకు అన్యాయం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్వాటర్ వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు. బాల్క సుమన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande