జూన్ 2 లేదా 3న ఫ్యూచర్ సిటీ కార్యాలయ ప్రారంభోత్సవం.. మంత్రి పొంగులేటి
రంగారెడ్డి, 28 మే (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 2 లేదా 3న ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్
Ponguleti


రంగారెడ్డి, 28 మే (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ 2 లేదా 3న ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి గురువారం ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనాన్ని మంత్రి దుద్దిళ్ల సందర్శించారు. పురోగతిలో ఉన్న పనులను పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం ముందుగా పనుల పురోగతిని పరిశీలించేందుకు తాము వచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును భవిష్యత్తులో ప్రపంచస్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా స్పష్టమైన దృక్పథంతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వేస్తున్న పునాదుల పై రాబోయే రోజుల్లో ఆధునిక నిర్మాణాలు వెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని, తమ ప్రభుత్వ హయాంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో పాటు, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక చట్టం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కట్టుబడి పని చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాక దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటోందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్ లో కొనసాగుతున్న యూనివర్సిటీ కోసం చేపడుతున్న శాశ్వత క్యాంపస్ నిర్మాణం వేగంగా జరుగుతోందని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంక, మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande