
ములుగు, 28 మే (హి.స.)
కళ్యాణ లక్ష్మీ షాధీముబారక్ చెక్కుల పంపిణీ ద్వారా ప్రభుత్వం పేదల కష్టాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని రైతు వేధికలో తహశీల్దార్ తోట రవీందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మండలంలోని 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పేదల కష్టాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలైన వారి పిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకంలో లక్షా వెయ్యి నూటపదహారు రూపాయలను అందజేస్తుందన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోతాయన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి కళ్యాణలక్ష్మి, షాధీముబారక్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు