
నాగర్ కర్నూల్, 28 మే (హి.స.)
ప్రభుత్వం తమకు ఫిక్స్డ్ వేతనం నెలకు రూ,18వేలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మండుటెండల్లో కొల్లాపూర్ లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు గురువారం ముట్టడించారు. తమ సమస్యలను మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లాలని ఆశా వర్కర్లు కొల్లాపూర్ నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయం వరకు ఎండల్లో తమ డిమాండ్లతో కూడిన బ్యానర్లు చేతపట్టుకొని ర్యాలీగా చేరుకున్నారు. క్యాంపు కార్యాలయం ముందు ముట్టడించిన ఆశా కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం నుంచి బయటికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు కు వివిధ సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు