
హైదరాబాద్, 28 మే (హి.స.) తెలంగాణలో రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడిన సంగతి తెలిసిందే. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండలు భగ్గుమన్నాయి. కాగా నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ ప్రకటించారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో సాయంత్రం నుండి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీటితో పాటు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో 43 డిగ్రీల నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగత్రలు ఉంటాయని, ఉండలు మండిపోతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..