టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు..
టూరిస్ట్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు..
bus-overturned-near-chinta-reddypalem


నెల్లూరు, 28 మే (హి.స.)గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మరువక ముందే మరో బస్సు బోల్తా ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెంలో వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

దాదాపు 45 మంది ప్రయాణికులతో ఏలూరు నుంచి నాగపట్నం వెళ్తున్న బస్సు గురువారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికులు సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుండగా.. పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande