
అనంతపురం, 28 మే (హి.స.)కేరళ మాజీ సీఎం పినరయి విజయ్ ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులను సీపీఎం రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఖండించారు. విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు ఉట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారని అన్నారు.
కేరళ మాజీ సీఎం పినరయి విజయ్ ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులను సీపీఎం రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ఖండించారు. విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు ఉట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఈడీ దాడులు చేశారని ఆరోపించారు. నరేంద్రమోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుండి ప్రతిపక్షనాయకుల ఇండ్లపై ఈడీ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విషయంలో కూడా అదే జరిగిందన్నారు. చివరికి కోర్టులు వారిని నిర్దోషులుగా తీర్పు ఇస్తుందన్నారు. బీజేపీ కండువా కప్పుకున్నవాళ్లుఎంత పెద్ద స్కాములు చేసినా వారిపై ఎలాంటి ఈడీ, సీబీఐ దాడులు జరగవని చెప్పారు. కేవలం ప్రతిపక్షాలపైనే పథకం ప్రకారం ఇలాంటివి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అస్సాం సీఎం, బెంగాల్ ప్రస్తుత సీఎంలపై గతంలో మోడీనే ఆరోపణలు చేశారని కానీ ఇప్పుడు వాళ్లు పార్టీలో చేరడంతో ఎలాంటి చర్యలు లేవని అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఒక్కరూ ఖండించాలని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV