
మదనపల్లె, 28 మే (హి.స.)
మదనపల్లె పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం హరికృష్ణరావు (MHR) జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి హరికృష్ణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, “హరికృష్ణరావు పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకుడు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.
పలమనేరు
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు ఆర్వీ బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబులు మాట్లాడుతూ.. తెలుగు జాతి గౌరవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో గర్వంగా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేదలు, బీసీలు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి సామాన్య ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV