శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా వైభవంగా బక్రీద్ వేడుకలు: మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు!
శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా వైభవంగా బక్రీద్ వేడుకలు: మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు!
bakrid-celebrations-held-with-f


శ్రీ సత్య సాయి జిల్లా, 28 మే (హి.స.): శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగాలో పవిత్ర బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే జిల్లా లోని పుట్టపర్తి తో పాటు పలు గ్రామాల మసీదులకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు తరలివచ్చి ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కొత్త దుస్తులు ధరించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక విందులు ఏర్పాటు చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

బక్రీదు పండుగ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని దర్గాలు, మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు.

జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా విధుల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణంలో బక్రీదు పండుగను జరుపుకోవాలని సూచించారు. సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande