సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు
Supreme Court


హరియాణా, 28 మే (హి.స.)

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్దం అయింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు కొలీజియం కసరత్తు చేపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం, నలుగురు సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులను, ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ జాబితాలో పంజాబ్ హరియాణా హైకోర్టు సీజే జస్టిస్ షీల్ నాగు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ శ్రీచంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సచ్ దేవ, జమ్మూ కశ్మీర్ లడఖ్ సీజే జస్టిస్ అరుణ్ పళ్లి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి. మోహన ఉన్నారు.

సుప్రీంకోర్టులో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించి, న్యాయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ నియామకాలు అత్యంత కీలకమని కొలీజియం తన సిఫార్సులో పేర్కొంది. కొలీజియం పంపిన ఈ జాబితాను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలించి, కేబినెట్ ఆమోదం కోసం పంపుతుంది.

కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయగానే ఈ నియామకాలు ఖరారవుతాయి. ఆ తర్వాత నూతన న్యాయమూర్తులుగా వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నియామకాలతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగి, కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande