తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల


తిరుమల, 28 మే (హి.స.)

కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి (Tirumala Tirupati) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఏడుకొండలు జనసందోహం గా మారాయి. దీంతో తిరుమల కొండపై ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు అన్ని పూర్తిగా నిండిపోవడంతో, స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ కాంప్లెక్స్ వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా, ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే బుధవారం తిరుమలలో రికార్డు దర్శనాలు జరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని 87,691 మంది భక్తులు దర్శించుకోగా.. మొక్కులు తీర్చుకునేందుకు గాను 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ కానుకల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 4.99 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande