పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయం
పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయం
పద్మనాభస్వామి ఆలయంలో బంగారం మాయం


తిరువనంతపురం 28 మే (హి.స.)

.కేరళలోని తిరువనంతపురంలోగల శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం చోరీ, భద్రతా లోపాలకు సంబంధించిన ఆరోపణలను హోం శాఖకు సమర్పించిన నివేదికలో డీజీపీ చంద్రశేఖర్ వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల్లో 78 గ్రాము ల బంగారు కడ్డీలు, నాణేలు కనిపించడం లేదని నివేదికలో పేర్కొన్నారు. మరమ్మతుల కోసం తొలగించిన గర్భగుడిలోని వైరా నామం గత ఆరు నెలలుగా తిరిగి ప్రతిష్టించలేదని తెలుస్తున్నది. ఆలయం వెలుపల భద్రపరిచిన విలువైన బంగా రం, వెండి వస్తువులను అన్నింటినీ ఒక కేంద్రీకృత స్ట్రాంగ్ రూమ్కు తరలించాలని కూడా డీజీపీ నివేదిక సిఫార్సు చేసింది్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande