విజయవంతమైన ‘హైబ్రిడ్’ మహానాడు
విజయవంతమైన ‘హైబ్రిడ్’ మహానాడు
విజయవంతమైన ‘హైబ్రిడ్’ మహానాడు


అమరావతి, 29 మే (హి.స.)

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన పొదుపు చర్యలకు అనుగుణంగా టీడీపీ నాయకత్వం చేపట్టిన

‘హైబ్రిడ్’ మహానాడు విజయవంతమైంది. కనీవినీ ఎరుగని రీతిలో సూపర్హిట్ అవ్వడంతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు..నాయకులకు నడుమ బంధం బలోపేతం అవడానికి ఈ రెండ్రోజుల కార్యక్రమం వేదికగా నిలిచింది. గత మహానాడలకు భిన్నంగా రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడుకు రికార్డు స్థాయిలో 24.50 లక్షల మంది కార్యకర్తలు వర్చువల్గా హాజరయ్యారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని దేశప్రజలందరినీ కోరారు. దీంతో మహానాడును బహిరంగంగా అట్టహాసంగా నిర్వహించుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగని పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తే కార్యకర్తల్లో పెద్దగా ఉత్సాహం కనిపించదు. పైగా క్షేత్రస్థాయిలో మినీ మహానాడులు అప్పటికి జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం.. అటు బహిరంగ నిర్వహణ అనుభూతిని శ్రేణులకు కలుగజేస్తూనే.. మరోవైపు పటాటోపం లేకుండా పొదుపు చర్యలు పాటించేలా హైబ్రిడ్ మహానాడుకు శ్రీకారం చుట్టింది. తొలుత స్పందన ఎలా ఉంటుందోనని పార్టీ పెద్దలు ఆందోళనకు గురయ్యారు. అయితే వారి ఆందోళనలను పటాపంచలు చేస్తూ 24.50లక్షల మంది హాజరయ్యారు. పార్టీ నాయకత్వాన్నే ఆశ్చర్యచకితులను చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande