మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా


కడప, 29 మే (హి.స.)కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట వద్ద గేదె అడ్డు రావడంతో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.

గత కొద్ది రోజులుగా ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు (Serial bus accidents) ప్రయాణికులతో పాటు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రైవేటు బస్సు (Private bus)లు బోల్తా పడుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి అనంతపురం జిల్లా కదిరి కి వెళ్తుంది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక గేదె అడ్డు రావడంతో, దానిని తప్పించబోయి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, తృటిలో పెద్ద ముప్పు తప్పింది. ఒక ప్రయాణికుడికి మాత్రం కాలికి తీవ్ర గాయం కాగా, మిగిలిన వారికి గాయాలు మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే 108 అత్యవసర వాహనం ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande