రాయలసీమ హక్కుల కోసం పోరాడదాం
రాయలసీమ హక్కుల కోసం పోరాడదాం
రాయలసీమ హక్కుల కోసం పోరాడదాం


నంద్యాల, 29 మే (హి.స.)రాయలసీమ సాగునీటి హక్కుల కోసం పోరాడదామని బసవేశ్వర సంఘం అధ్యక్షుడు ఎంసీ కొండారెడ్డి పిలుపునిచ్చారు. సిద్దేశ్వరం అలుగు ప్రజాశంకుస్థాపన 10వ వార్షికోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలోని గ్రామాల్లో రైతులకు సాగునీటి హక్కులపై అవగాహన కల్పించి కరపత్రాలను విడుదల చేశారు.

ఈనెల 31న నంద్యాలలోని చాబోలుమెట్ట వద్ద ఏఎ్సఆర్ పంక్షన్హాల్లో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జాదశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో మహానభ ఉంటుందని, విజయవంతం చేయాలని రైతులకు పిలుపుచ్చారు. రాయలసీమకు సాగునీటి హక్కులు పొందాలంటే కృష్ణానదియాజమాన్య బోర్డు తక్షణమే కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బొజ్జాతోపాటు మాజీ ఎంపీ వడ్డేశోభనాదీశ్వరరావు, సుప్రింకోర్టు విశ్రాంతన్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ్త, రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ వస్తున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande