చైర్మన్ బీ ఆర్ నాయుడు అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం
చైర్మన్ బీ ఆర్ నాయుడు అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం
చైర్మన్ బీ ఆర్ నాయుడు అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం


తిరుమల: 06 మే (హి.స.)

ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తితిదే పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. తిరుమలలోని ఆళ్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలకు రూ.4.54 కోట్ల నిధుల మంజూరు.. శ్రీవారి ఆలయ మాడ వీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తాగ్రేసుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు రూ.6 కోట్లతో పైపు లైన్లు, రూ.44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జీ- స్క్వేర్ సంస్థ తితిదే పేరిట రిజిస్టర్ చేసిన 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ.36.9 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande