కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్.. కేటీఆర్ (update)
కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్.. కేటీఆర్
Ktr


వరంగల్, 06 మే (హి.స.)

వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని.. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కథం తొక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ లో జరిగిన రైతు సంగ్రామ సదస్సు లో బుధవారం పాల్గొని ఆయన మాట్లాడారు. వరంగల్లో ఏం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్నారు. వరంగల్లో పోరాటాల విల్లు ఎక్కుపెడితే.. ద్రోహుల గుండె ಜಲ್ಲು మంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పెద్ద దొంగలు అని.. రాహుల్ వరంగల్ డిక్లరేషన్ సభ పెట్టి దొంగ హామీలు ఇచ్చారన్నారు. ఇవాళితో కాంగ్రెస్ నయవంచనకు నాలుగేళ్లు నిండాయన్నారు. రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్.. రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చారన్నారు.

ఇచ్చిన 34 హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బాండ్ పేపర్లు రాసి కాకమ్మ కథలు చెప్పారు. రైతులు దొంగ హామీలు నమ్మి కాంగ్రెస్కు ఓటేశారన్నారు. రెండున్నరేళ్లు పూర్తైనా రైతు డిక్లరేషన్ ఊసే లేదన్నారు. ఎకరానికి రూ.15 వేలు ఎందుకు ఇవ్వట్లేదని.. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? అని ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. అన్ని పంటలను బోనస్ ఇచ్చి కొంటామన్నారు. కౌలు రైతుకు ఎకరానికి రూ. 14 వేలు వస్తుందా అని ప్రశ్నించారు. పంట బీమా పథకం ఎక్కడికి పోయింది..? అసైన్డ్ భూములకు పట్టాలు ఎప్పుడిస్తారన్నారు. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం అన్నారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారన్నారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్, రేవంత్ ఎక్కడికి పోయారన్నారు. దుక్కి దున్నే రైతులను దారుణంగా వంచించారన్నారు. కాంగ్రెస్తో మెగా రైతు మేళా కాదు.. దగా రైతు మేళా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అన్నారు. నాట్లేసే టైమ్కు కేసీఆర్ రైతుబంధు పడేదన్నారు. కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అందరూ కాపీ కొట్టారన్నారు.. రైతులు పెట్టుబడి సాయం కోసం అప్పుల పాలయ్యేవారన్నారు. రైతులకు 11 విడతలుగా రూ. 73 వేల కోట్లు ఇచ్చారన్నారు. కేసీఆర్ సర్పంచ్ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఒక్కసారే రైతు భరోసా ఇచ్చారన్నారు. డిక్లరేషన్ అమలుకు రైతులు కాంగ్రెస్ను గల్లా పట్టి నిలదీయాలన్నారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ ఎగబెట్టాడన్నారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ వచ్చి భద్రకాళి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని చెప్పారు.

రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం.. ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే చేస్తాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టోపీ బారానా అన్నారు. రాజీనామా రుణమాఫీ 왕영링.. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల్లో పురుగుల మందు తాగారన్నారు. కాంగ్రెస్ పాలనలో దందాలు, కమీషన్లు, కొట్లాటలు రైతులు, ప్రజల గురించి పట్టించుకునే వాళ్లు లేరన్నారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవన్నారు. రాహులు మాత్రం పైసల మూటలు పంపుతున్నారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులను నెంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. ఆగమైన తెలంగాణను బాగు చేసింది బీఆర్ఎస్ నే నన్నారు. రైతు ప్రగతికి అద్భుతమైన పథకాలు కేసీఆర్ తెచ్చారన్నారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. రాబంధు రాజ్యం పోయి రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుందన్నారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన నాలుగు తీర్మానాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ రాబంధు పాలనలో 1000 మందికి పైగా రైతులు చనిపోయారు. రోడ్డున పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande