
సిద్దిపేట, 06 మే (హి.స.)
రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం వారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసాపూర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చిన రైతులు. వెంటనే జిల్లా కలెక్టర్ హైమావతి తో ఫోన్ లో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలు లో బారదన్, టార్పాలిన్ సమస్యలు రాకుండా చూసుకోవాలని, లారీలో ఎప్పటికప్పుడు వెంట వెంటనే లోడ్ పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో బస్సాపూర్ సర్పంచ్ బానోతు లింగం, ఆరేపల్లి సర్పంచ్ చిట్యాల బాపురాజు, ఐకెపి సెంటర్ నిర్వాహకులు, బస్వాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు