
సిద్దిపేట, 06 మే (హి.స.)
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 23వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు శాంతిభద్రతల పరిరక్షణ తీసుకుంటామన్నారు. నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దీనికి తోడు కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు మే 23వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు