నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డి పాలెం లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చోరీ
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చోరీ
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డి పాలెం లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చోరీ


కలిగిరి, 06 మే (హి.స.)

: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఆలయం లోపలికి చొరబడిన దుండగులు.. హుండీని ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదుతో పరారయ్యారు. ఆ హుండీని సమీపంలోని కంప చెట్లలో మధ్యలో వదిలివెళ్లారు. బుధవారం ఉదయం గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో సుమారు రూ.50 వేల వరకు నగదు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకుకేసునమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనేదొంగలను పట్టుకుంటామని వెళ్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande