సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.. బండి సంజయ్
సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.. బండి సంజయ్
బండి సంజ


కరీంనగర్, 06 మే (హి.స.)

అకాల వర్షాలు, ఈదురు గాలులతోరాష్ట్రంలో చాలాచోట్ల వడ్లు కొట్టుకుపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, రైతుల కన్నీళ్లకు బాధ్యులెవరని కేంద్ర బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కోనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతుంటే పట్టించుకోరా అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల ఆరుగాలం కష్టమంతా నీళ్లపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గింజ కొనుగోలుకు కేంద్రమే పైసలిస్తుంటే వాళ్లకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. సుతిలీతాడు, దబ్బడం, రవాణా ఛార్జీలు సహా అన్నీ కేంద్రమే చెల్లిస్తున్నది వాస్తవం కదా అని అన్నారు. వడ్లను కొనుగోలు చేసినందుకు కమీషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమే ఇస్తుందని తెలిపారు, అయినా వడ్ల కొనుగోలులో అంత నిర్లక్ష్యం ఎందుకని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు గాను 16 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కూడా కొనలేని దుర్మార్గపు రాష్ట్ర ప్రభుత్వం ఇదేనని బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేకపోవడం శోచనీయమని కామెంట్ చేశారు. రైతులు పడుతున్న కష్టాలను ప్రస్తావిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన వడ్లను కూడా కనీన మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, సీఎం సహా మంత్రులంతా యాసంగి వడ్ల కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande