తిరుపతి తిరుమల దేవస్థానం దేవస్థానం.ట్రస్టుకు 20 లక్షల విరాళం
తిరుపతి తిరుమల దేవస్థానం దేవస్థానం.ట్రస్టుకు 20 లక్షల విరాళం
తిరుపతి  తిరుమల దేవస్థానం దేవస్థానం.ట్రస్టుకు 20 లక్షల విరాళం

తిరుమల:, 07 మే (హి.స.)

తిరుపతి తిరుమల దేవస్థానం ట్రస్టులకు రూ.20 లక్షల విరాళం అందింది. హైదరాబాద్లోని బాలానగర్కు చెందిన నవ్య మార్కెటింగ్ యాజమాన్యం తితిదే బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ప్రకటించింది. అదేవిధంగా గుంటూరుకు చెందిన వెంకటకృష్ణ చైతన్య తితిదే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతల తరఫున తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు విరాళం డీడీలను ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande