కొత్తపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
కొత్తపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
కొత్తపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు


అంబేద్కర్ కోనసీమ, 07 మే (హి.స.)

కొత్తపేటలో భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి సుమారు కోటి రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2025, ఆగష్టు31న జరిగిన ఇంటి చోరీ కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. బీరువా పగలగొట్టి 646.361 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు పొన్నాడ రవిశంకర్, పైరా చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియాకు వెల్లడించారు. ప్రధాన నిందితుడు పొన్నాడ రవిశంకర్పై ఇప్పటి వరకు120 దొంగతనం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. రెండవ నిందితుడిపై ఓ హత్య కేసు కూడా ఉన్నట్లు వెల్లడించారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande