
, నెల్లూరు; కొడవలూరు:, 07 మే (హి.స.)
తెలుగుదేశం ‘మహానాడు’ నిర్వహణకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అంకురార్పణ చేశారు. తొలిసారిగా జిల్లాలో రాష్ట్రస్థాయి మహానాడు నిర్వహిస్తుండటంతో పసుపు దళంలో నూతనోత్సాహం నెలకొంది. బుధవారం ఉదయం కొడవలూరు మండలం చంద్రశేఖరపురం సమీపంలోని ఇఫ్కో సెజ్ ప్రాంగణంలో సంబంధిత పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి దంపతులు టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ ఆదేశాల మేరకు లక్షల మందికి సౌకర్యంగా ఉండేలా 2,200 ఎకరాల్లోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంతాన్ని మహానాడుకు ఎంపిక చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. మే 27, 28, 29 తేదీల్లో జరిగే సభల్లో రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే తీర్మానాలు చేస్తారని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ