జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

,జమ్మలమడుగు మే (హి.స.)

వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన రథోత్సవం వైభవంగా సాగింది. ఉదయం 07.30 గంటలకు వృషభలగ్నంలో స్వామివారు రథారోహణం చేసి, అనంతరం ఉదయం 8.30 గంటలకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణ, భజనలు, కోలాటాల నడుమ సాగిన రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఇవాళ రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు ఆలయ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande