కార్యకర్తలకు తెదేపా అండ గా నిలుస్తుంది బొబ్బిలి ఎమ్మెల్యే...బేబీ నాయన
కార్యకర్తలకు తెదేపా అండ గా నిలుస్తుంది బొబ్బిలి ఎమ్మెల్యే...బేబీ నాయన
కార్యకర్తలకు తెదేపా అండ గా నిలుస్తుంది బొబ్బిలి ఎమ్మెల్యే...బేబీ నాయన

రామభద్రాపురం: 07 మే (హి.స.)

కార్యకర్తలకు తెదేపా అండగా నిలుస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన అన్నారు. రామభద్రపురం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మైనాపు తారయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త తెదేపా సభ్యత్వం తీసుకోవాలని ఆయన కోరారు. సభ్యత్వం తీసుకున్న వారు ఎలాంటి ప్రమాదంలో మరణించినా ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చెక్కును పార్టీ అందించి అండగా నిలస్తుందని చెప్పారు. ఆయన వెంట తెదేపా మాజీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి చింతల రామకృష్ణ, నాయకులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande