ఏసీబీ వలలో భద్రాచలం అటవీ శాఖ అధికారులు
భద్రాచలం, 07 మే (హి.స.) రోడ్డు వేస్తుండగా కొన్ని చెట్లు కట్ కావడంతో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ఓ సుజాత రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష
Acb


భద్రాచలం, 07 మే (హి.స.)

రోడ్డు వేస్తుండగా కొన్ని చెట్లు కట్

కావడంతో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ఓ సుజాత రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఆమెను, చర్ల ఇంచార్జ్ డీఆర్ కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బ తిన్నాయి. ఈ ఎపిసోడ్లో ఎఫ్ఎఓ సుజాత రూ.10లక్షలు డిమాండ్ చేసి భద్రాచలం కార్యాలయంలో రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ డీఆర్ఎతో పాటు పట్టుబడ్డారు. గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి మూడున్నర లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande