బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను రెండేళ్లలో చేసి చూపించాం: మంత్రి తుమ్మల
బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను సీఎం రేవంత్రెడ్డి రెండేళ్లలోనే చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు
Tummala


హనుమకొండ, 07 మే (హి.స.)బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను సీఎం రేవంత్రెడ్డి రెండేళ్లలోనే చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొదటి ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేశారని చెప్పారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి రైతు మేళాలో తుమ్మల పాల్గొని, మాట్లాడారు.

‘‘రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ సర్కార్ రూ.21 వేల కోట్లను జమ చేసింది. రూ.లక్ష రుణమాఫీని కేసీఆర్ పదేళ్లలో ఏనాడూ పూర్తి చేయలేదు. రుణమాఫీకి బీఆర్ఎస్ ఐదేళ్ల సమయం తీసుకోవడంతో.. వాళ్లిచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదు. ఒక్క రైతుబంధు ఇచ్చి.. మిగతా పథకాలన్నింటినీ నిలిపివేశారు. బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మళ్లీ ఆ పార్టీకి అధికారం ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. ఇవాళ రైతులకు అప్పులు తక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది’’ అని తుమ్మల తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande