కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
రైతుల ధర్నా


కరీంనగర్, 07 మే (హి.స.)

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వెంకటాయపల్లి స్టేజి సమీపంలో, మంగపేట వద్ద కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల క్రితం పోసిన వరి ధాన్యాన్ని ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో పాటు తూకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్తాకు 40.600 కిలోలు మాత్రమే ఉండాల్సిన వడ్లను 42.200 కిలోల తూకం కప్ ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం రెండు లారీల వడ్లను మాత్రమే రైస్ మిల్లులకు తరలించారని, అక్కడికి చేరుకున్న తర్వాత కూడా బస్తాకు కిలోకు పైగా తరుగు తీస్తూ సుమారు 700 కిలోల వరకు నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. వేస్తున్నారని

దీంతో తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ ధర్నాతో కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రహదారిపై ఇరువైపులా వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న గంగాధర తహశీల్దార్ అంబటి రజిత, ఎస్సై వంశీకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పై అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande