ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది
Modi


హైదరాబాద్, 07 మే (హి.స.)ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రధాని మోదీ బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం హెచ్ఐసీసీకి బయల్దేరి.. అక్కడే ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం హైటెక్ సిటీలో ఓ ఆస్పత్రికి ప్రారంభించనున్నారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట నుంచి గుజరాత్లోని జామ్నగర్కు పయనమవుతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande