పదో తరగతి. ఫలితాల్లో అత్యధిక మార్కులు. సాధించిన విద్యార్దులకు సత్కారం
పదో తరగతి. ఫలితాల్లో అత్యధిక మార్కులు. సాధించిన విద్యార్దులకు సత్కారం
పదో తరగతి. ఫలితాల్లో అత్యధిక మార్కులు. సాధించిన విద్యార్దులకు సత్కారం

కావలి, 07 మే (హి.స.)

పట్టణంలో ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. గురువారం ట్రంక్ రోడ్లోని సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో బాలాజీ రావు ఎంఈవో గోవిందయ్య, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande