అనంతపురం జిల్లాలో ఆపిల్ సాగు - రెండున్నర ఎకరాల్లో 1500 మొక్కలు
అనంతపురం, 07 మే (హి.స.)కరవు సీమలో అనంత ఆపిల్ పండ్ల సాగు అన్నదాతలు సిరులు కురిపిస్తోంది. తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశోధన శాలగా మార్చుకున్న రైతు రమణారెడ్డి అనేక పంటలపై ప్రయోగాలు చేస్తూ అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. గతంలో అనంతపురం జిల్లా
armer-ramana-reddy-amazes-everyone-with-his-apple-cultivation-in-


అనంతపురం, 07 మే (హి.స.)కరవు సీమలో అనంత ఆపిల్ పండ్ల సాగు అన్నదాతలు సిరులు కురిపిస్తోంది. తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశోధన శాలగా మార్చుకున్న రైతు రమణారెడ్డి అనేక పంటలపై ప్రయోగాలు చేస్తూ అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

గతంలో అనంతపురం జిల్లాలో తొలిసారిగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేసి తన ఇంట సిరులు కురిపించుకున్నాడు. అప్పట్లో డ్రాగన్ ఫ్రూట్ అంటు మొక్కలు తానే తయారు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రైతులకు చౌకగా విక్రయించాడు. ఈ తరహాలోనే జిల్లాలో ఏడేళ్ల క్రితం ఖర్జూరం సాగుచేసి, శాస్త్రవేత్తలకు పరిశోధన స్థానంగా తన పంట భూమిని మార్చేశాడు. ఖర్జూరంతో నాలుగేళ్లుగా పెద్దఎత్తున దిగుబడి సాధిస్తూ లాభాలు గడిస్తున్నాడు. మరో కొత్త పంటను సాగుచేయాలని ఆలోచించిన ఆ రైతు ఆపిల్ను ఎంపిక చేసుకొని ఇజ్రాయెల్ నుంచి మొక్కలు తెప్పించాడు. 2022లో ఆపిల్ సాగుచేసిన రమణారెడ్డి నెల రోజుల క్రితం తొలి ఆపిల్ దిగుబడి రెండున్నర టన్నులు బెంగుళూరులోని కార్పోరేట్ సూపర్ మార్కెట్కు విక్రయించాడు. వచ్చిన దిగుబడిలో 50 శాతం మాత్రమే విక్రయించిన రైతు రమణారెడ్డి, సగం పంటను కోయకుండా, తోట చూడటానికి వచ్చేవారికి ఆపిల్ పండ్ల రుచి చూపిస్తున్నాడు. ఆపిల్ సాగు గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తోటకు వెళ్లి రమణారెడ్డితో సాగు విధానం, మార్కెటింగ్ పరిస్థితులను తెలుసుకున్నారు.

హిమాచల్ప్రదేశ్కు వెళ్లి ‘అన్నా వెరైటీ ఆపిల్’ మొక్కలు తెచ్చి సాగు ప్రారంభించాడు. కానీ అనంతపురం అధిక ఉష్ణోగ్రతలకు అవి తట్టుకోలేకపోయాయి. మూడేళ్ల కష్టానికి నిమ్మకాయ సైజ్ కాయలు మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.6 లక్షల నష్టం వచ్చింది. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. కానీ రమణారెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. యూట్యాబ్లో సెర్చ్ చేసి మరింత సమాచారం తెలుసుకున్నాడు

ఈ రైతు విజయాన్ని చూసి కర్నాటక, తెలంగాణ రైతులు కూడా ఈ ఆపిల్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఎండలతో పోరాడే అనంతపురం నేల... ఇప్పుడు ఇజ్రాయెల్ ఆపిల్ పండ్లతో ఎర్రగా మెరిసిపో తోంది. కరవు నేలలో కూడా కలలు పండుతాయి... ధైర్యం ఉంటే పంటలు మారుతాయి... ఒక రైతు ఆలోచన మారితే... ఒక ప్రాంత భవిష్యత్తే మారుతుంది. ఇది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతు కథ!

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande