తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 11 కంపార్టుమెంట్లలో భక్తులు
తిరుమల, 07 మే (హి.స.) తిరుమలలో చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. గురువారం ఉదయం 8 గంటల సమయం వరకూ.. శ్రీవారి దర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధి
తిరుమల


తిరుమల, 07 మే (హి.స.)

తిరుమలలో చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. గురువారం ఉదయం 8 గంటల సమయం వరకూ.. శ్రీవారి దర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కొత్త క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు రద్దీని బట్టి దర్శన సమయాలు మారుతాయని తెలిపారు. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 3-5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు.

నిన్న (బుధవారం) 71,029 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 31,184 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande