గుంతకల్లు-మార్కాపురం ప్యాసింజర్కు 12న శ్రీకారం
గుంతకల్లు-మార్కాపురం ప్యాసింజర్కు 12న శ్రీకారం
Train


గుంతకల్లు , 07 మే (హి.స.)

నంద్యాల మీదుగా గుంతకల్లు-మార్కాపురం మధ్య కొత్త ప్యాసింజర్ రైలు సేవలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, టీడీపీ నేత ఎన్. ఎం. డి. ఫరూక్ పాల్గొంటారు. రైలు నం. 57407 గుంతకల్లు నుంచి సాయంత్రం 5:30కు బయలుదేరి రాత్రి 8:30కు నంద్యాల, రాత్రి 11:30కు మార్కాపురం చేరుకుంటుంది. తిరుగు రైలు నం. 57408 మార్కాపురం నుంచి ఉదయం 4:30కు బయలుదేరి ఉదయం 7:20కు నంద్యాల, ఉదయం 10:30కు గుంతకల్లుకు చేరుతుంది.ఈ కొత్త రైలు సేవలు రాయలసీమ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా మహానంది మరియు శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande